లేఖనాలను అన్వేషించండి

యోబు 36: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు. "

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 32:14

ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు.

2దినవృత్తాంతములు 28:13

యెహోవా మనమీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపుజేయుటకు మీరు పూనుకొనియున్నారు; మన అపరాధము అధికమైయున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది.

2దినవృత్తాంతములు 28:22

ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధికముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.

రోమీయులకు 2:5

నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.

యోబు 15:4

నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.

యోబు 27:8

దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది?

యోబు 27:9

వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?

యోబు 27:10

వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?

యోబు 35:9

అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.

యోబు 35:10

అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు

మత్తయి 22:12

స్నేహితుడా, పెండ్లివస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియై యుండెను.

మత్తయి 22:13

అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.

యోబు 36:8

వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధా పాశములచేత పట్టబడినయెడలను

కీర్తనలు 107:10

దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున

లేవీయకాండము 14:41

అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమున పారబోసి

యోబు 8:13

దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.

యోబు 13:16

ఇదియు నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.

యోబు 15:34

భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును

యోబు 38:23

ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధదినము కొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?

యోబు 40:13

కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము.

యెషయా 9:13

అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు.

దానియేలు 9:13

మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు.

హోషేయ 7:7

పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులందరును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.

హగ్గయి 2:17

తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.

మత్తయి 12:32

మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

లూకా 12:1

అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి

1పేతురు 2:1

ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్నయెడల