యోబు 9: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు పడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుటలేదు
ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను.
ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయన యెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను.
నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియకపోయెననుకొని