లేఖనాలను అన్వేషించండి

యోహాను 10: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 12:34

జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్యకుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.

యోహాను 15:25

అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను.

రోమీయులకు 3:10

ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

రోమీయులకు 3:11

గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

రోమీయులకు 3:12

అందరును త్రోవతప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

రోమీయులకు 3:13

వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

రోమీయులకు 3:14

వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.

రోమీయులకు 3:15

రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.

రోమీయులకు 3:16

నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.

రోమీయులకు 3:17

శాంతిమార్గము వారెరుగరు.

రోమీయులకు 3:18

వారి కన్నులయెదుట దేవుని భయము లేదు.

రోమీయులకు 3:19

ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

కీర్తనలు 82:1

దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.

కీర్తనలు 82:6

మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను.

కీర్తనలు 82:7

అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.

నిర్గమకాండము 4:16

అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.

నిర్గమకాండము 7:1

కాగా యెహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.

నిర్గమకాండము 22:28

నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు.

కీర్తనలు 138:1

నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.

నిర్గమకాండము 12:12

ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతి యంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.

1సమూయేలు 28:13

రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.

కీర్తనలు 146:6

ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.

మత్తయి 9:13

అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను

లూకా 4:4

అందుకు యేసు మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి యున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

యోహాను 8:17

మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.

రోమీయులకు 3:19

ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

1కొరిందీయులకు 8:5

దేవతలనబడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

1కొరిందీయులకు 14:21

అన్యభాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది

గలతీయులకు 4:21

ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి.