యోహాను 12: 34
క్రాస్-రిఫరెన్స్‌లు
" జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్యకుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.
అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను.
మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.
మరియొకప్పుడు ఆయన నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.
గోధుమగింజ భూమిలోపడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును.