యెహోషువ 12: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి."
సంబంధిత రిఫరెన్స్‌లు
యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను.
గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.
అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను.
అమోరీయుల రాజైన ఓగును హతము చేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను.
బహు రౌద్రము కలిగి నీవు భూమిమీద సంచరించుచున్నావు మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు