లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 16: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 16:2

తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును.

యెహోషువ 18:13

అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్‌హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారువరకు వ్యాపించెను.

యెహోషువ 10:10

అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్‌ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.

యెహోషువ 21:22

కిబ్సాయిమును దాని పొలమును బేత్‌హోరోనును దాని పొలమును వారికిచ్చిరి.

1సమూయేలు 13:18

రెండవ గుంపు బేత్‌ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను.

1దినవృత్తాంతములు 6:68

యొక్మెయామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,

1దినవృత్తాంతములు 7:24

అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‌ హోరోనును దక్షిణపు బేత్‌ హోరోనును ఉజ్జెన్‌ షెయెరాను కట్టించెను.

2దినవృత్తాంతములు 8:5

ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకార పట్టణములుగా కట్టించెను.