లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 1: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులచేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 9:25

కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

ద్వితియోపదేశాకాండము 20:11

గుమ్మములను తెరచినయెడల దానిలోనున్న జనులందరు నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు.

యెహోషువ 17:12

కనానీయులు ఆ దేశ ములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టి యుండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేక పోయిరి.

యెహోషువ 17:13

ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులచేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు.

1సమూయేలు 14:24

నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి.

1రాజులు 9:21

ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటివరకు ఆలాగు జరుగుచున్నది.