లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 11: 32

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడుయెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్ప గించెను గనుక అతడు వారిని"

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 1:4

కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.

న్యాయాధిపతులు 2:18

తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆ యా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువులచేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం చెను.

న్యాయాధిపతులు 3:10

యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతనిచేతికప్పగించెను, ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను.