న్యాయాధిపతులు 8: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను.
యెహోవా యెరుబ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు.
మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పది రెండవ సంవత్సరము వరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు.
అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనులయొద్దనుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు.