లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 8: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు గిద్యోను ఈ హేతువుచేతను జెబహును సల్మున్నాను యెహోవా నాచేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 8:16

ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.

న్యాయాధిపతులు 8:15

అప్పుడతడు సుక్కో తువారియొద్దకు వచ్చిజెబహు సల్మున్నా అను వారిచేతులు నీచేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహా రము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి

1దినవృత్తాంతములు 20:3

దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్ళతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేమునకు తిరిగివచ్చిరి.