లేవీయకాండము 11: 32
క్రాస్-రిఫరెన్స్‌లు
" వాటిలో చచ్చినదాని కళేబరము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది చెక్కపాత్రయే గాని బట్టయే గాని చర్మమే గాని సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్రమగును."
సంబంధిత రిఫరెన్స్‌లు
దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను; దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను.
స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను.
ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను.
వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
మూతవేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును.
అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలోవేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను.