లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 11: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములోనేమి, నదులలోనేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 14:9

నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా, రెక్కలు పొలుసులుగల వాటినన్నిటిని తినవచ్చును.

ద్వితియోపదేశాకాండము 14:10

రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తినకూడదు అది మీకు హేయము.

అపోస్తలులకార్యములు 20:21

దేవుని యెదుట మారుమనస్సుపొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.

గలతీయులకు 5:6

యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.

యాకోబు 2:18

అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.

1యోహాను 5:2

మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము.

1యోహాను 5:3

మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.

1యోహాను 5:4

దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే

1యోహాను 5:5

యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?