లేవీయకాండము 27: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొలచొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది."
సంబంధిత రిఫరెన్స్‌లు
భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.
వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను.
కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి
దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
అది నీయొద్ద నున్నపుడు నీదేగదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను
పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రసమిచ్చును తూమెడుగింజల పంట ఒక పడియగును.
తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను.
తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.
ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. నూట ఎనుబది పళ్ల గోధుమలలో మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్లయవలలో మూడు పళ్లవంతునను చెల్లింపవలెను.
తైలము చెల్లించునదెట్లనగా నూట ఎనుబది పళ్ల నూనెలో పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును.
కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని