లేవీయకాండము 27: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మీకు అనుకూలమైనయెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి.
యెహోవా యెంతో అబ్బురముగా వారు నాకేర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.
నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.
అప్పుడు విలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది
వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను.
ఆ రెండు నెలల అంత మున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.