లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 6: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" పెనముమీద నూనెతో దానిని కాల్చవలెను; దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 2:5

నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.

లేవీయకాండము 7:9

పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.

1దినవృత్తాంతములు 9:31

లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండివంటలమీద నుంచబడెను.