లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 7: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" చచ్చినదాని క్రొవ్వును చీల్చినదాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 17:15

మరియు కళేబరమునైనను చీల్చబడినదానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.

లేవీయకాండము 22:8

అతడు కళేబరమునైనను చీల్చబడినదానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను.

నిర్గమకాండము 22:31

మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను.

ద్వితియోపదేశాకాండము 14:21

చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.

యెహెజ్కేలు 4:14

అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటివరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా

యెహెజ్కేలు 44:31

పక్షులలోను పశువులలోను తనకుతాను చచ్చినదానినిగాని చీల్చబడినదానిని గాని యాజకులు భుజింపకూడదు.

లేవీయకాండము 9:21

బోరలను కుడిజబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.