లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 7: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 7:21

ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని యే అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలి పశువు మాంసమును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

ఆదికాండము 17:14

సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.

నిర్గమకాండము 29:25

తరువాత నీవు వారి చేతులలోనుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠముమీద దహింపవలెను. అది యెహోవాకు హోమము.

లేవీయకాండము 3:17

అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.

లేవీయకాండము 7:27

ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.