మార్కు 16: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగివెళ్లగా, పదునొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి
ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని
త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమకేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.
అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికిపోయి చూచి నమ్మెను.
గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.
త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.
ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి.
ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు
ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని
త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమకేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.