సామెతలు 12: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.
సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.
నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.
అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితో కూడిన కొంచెమే శ్రేష్ఠము.
నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టిపనులు చేయవలసి వచ్చును.
సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.
సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.
ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.
బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును.