కీర్తనలు 107: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహా జలములమీద సంచరించుచు వ్యాపారము చేయువారు "
సంబంధిత రిఫరెన్స్‌లు
దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.
యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసెదను
వాడు కృతజ్ఞతార్పణముగా దానినర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంటలను అర్పింపవలెను.
కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ద జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు
సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి.
నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి.
ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యము లన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను.
యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి.
అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను.
అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవాను గూర్చి యీ కీర్తన పాడిరి యెహోవాను గూర్చి గానము చేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను
మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీకొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను.
కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా
వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతిబలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు.
నాల్గవ దినమున వారు బెరాకా1 లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా1 లోయయని పేరు.
ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువులకంటె ఎత్తుగా నా తల యెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.
విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి
యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును.
నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.
కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి.
మరియు జనులు దహనబలులను బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసికొని యూదా పట్టణములలోనుండియు, యెరూషలేము ప్రాంతములలోనుండియు, బెన్యామీను దేశములోనుండియు, మైదానపు దేశములోనుండియు, మన్యములోనుండియు, దక్షిణదేశములోనుండియు వచ్చెదరు; యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసికొనివచ్చెదరు.
సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు
ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశముతట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి.
నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను.
ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.
సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.
వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని యుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.
అయితే ఆయన నీవు నీ యింటికి తిరిగివెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చెసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను
వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.
అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను
కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.
క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.
యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.