లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 107: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 12:25

వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.

యెషయా 19:14

యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించియున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు

యెషయా 29:9

జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు.

యోబు 37:20

నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?

యెషయా 19:3

ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారియొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.

అపోస్తలులకార్యములు 27:15

దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతివిు.

అపోస్తలులకార్యములు 27:16

తరువాత కౌద అనబడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయెను.

అపోస్తలులకార్యములు 27:17

దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.

అపోస్తలులకార్యములు 27:18

మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయసాగిరి.

అపోస్తలులకార్యములు 27:19

మూడవ దినమందు తమచేతులార ఓడసామగ్రి పారవేసిరి.

అపోస్తలులకార్యములు 27:20

కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగ పోయెను.

యెషయా 24:20

భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.

యెషయా 28:7

అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చు కాలమున తత్తరపడుదురు.

యిర్మియా 49:23

దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదు దానికి నెమ్మదిలేదు.

మత్తయి 14:30

గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.

అపోస్తలులకార్యములు 27:18

మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయసాగిరి.