కీర్తనలు 119: 124
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము"
సంబంధిత రిఫరెన్స్‌లు
(కఫ్) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను
నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి
నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను.
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము
వ్యర్థసహాయముకొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురుచూచుచుంటిమి.
నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్ల చూచి చూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.
బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసినయెడలను
నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను.
నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.
నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము.
దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచలాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడియుండుము.
మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్యవిషయములో అనుభవము లేనివాడైయున్నాడు.