లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 119: 85

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 39:4

యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొనగోరుచున్నాను.

కీర్తనలు 39:5

నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే యున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు.(సెలా.)

కీర్తనలు 89:47

నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసికొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించియున్నావు?

కీర్తనలు 89:48

మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశముకాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?

కీర్తనలు 90:12

మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.

యోబు 7:6

నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.

యోబు 7:7

నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు.

యోబు 7:8

నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును.

కీర్తనలు 7:6

యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.

ప్రకటన 6:10

వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.

ప్రకటన 6:11

తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను; మరియు--వారివలెనే చంపబడబోవువారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

ఆదికాండము 47:28

యాకోబు ఐగుప్తు దేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలుబదియేడు.

యిర్మియా 15:15

యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసికొనుము.