కీర్తనలు 17: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొనియున్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి.
అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలా పర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను.
మార్గముననున్న గొఱ్ఱదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక
సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన మూడువేల మందిని తీసికొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయెను.
సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని
తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును.
గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడువారిని పట్టుకొన పొంచియుందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.
కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు.
వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును.
వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.
నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు