కీర్తనలు 17: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ కృపాతిశయములను చూపుము."
సంబంధిత రిఫరెన్స్‌లు
అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపనువలె వాని కాపాడెను.
నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కలనీడను శరణుజొచ్చియున్నాను.
యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కలచాటున దాగుకొందును (సెలా.)
నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కలక్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునైయున్నది.
యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.
యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కలక్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి.
దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.
గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.
దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము.
నా దేవా, భక్తిహీనులచేతిలోనుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము.
యెహోవా, భక్తిహీనులచేతిలో పడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షింపుము. నేను అడుగుజారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు.
గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)
ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలుగల దేశమా!
నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలివచ్చుచున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.
నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.