లేఖనాలను అన్వేషించండి

రోమీయులకు 7: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" నేను కోరనిదానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

రోమీయులకు 7:15

ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.

రోమీయులకు 7:18

నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.

ఫిలిప్పీయులకు 3:12

ఇదివరకే నేను గెలిచితినని యైనను, ఇదివరకే సంపూర్ణసిద్ధి పొందితినని యైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను.

1పేతురు 3:11

అతడు కీడునుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.