లేఖనాలను అన్వేషించండి

రూతు 1: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు పెద్ద వారగువరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరికత్తెలై యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంత కంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 2:15

సేన మధ్యనుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను.

న్యాయాధిపతులు 2:15

యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.

1సమూయేలు 5:11

కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించి ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టియుండెను.

యోబు 19:21

దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.

కీర్తనలు 32:4

దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.)

కీర్తనలు 38:2

నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది.

కీర్తనలు 39:9

దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని.

కీర్తనలు 39:10

నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీచేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను.

ఆదికాండము 38:11

అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను

ద్వితియోపదేశాకాండము 25:5

సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.