రూతు 2: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అందుకు దేవుడు అవును, యధార్థహృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు
దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.
ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.
తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.
మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టునియందున్నదనియు ఎరుగుదుము.
అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవనుచేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.
మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేది పోయుదునని చెప్పి
త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.
మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను.
ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.
ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను
అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?