లేఖనాలను అన్వేషించండి

జెకర్యా 14: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ దినమున గుఱ్ఱముల యొక్క కళ్లెములమీద యెహోవాకు ప్రతిష్టితము అను మాట వ్రాయబడును; యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్లెములవలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 3:19

ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

యెషయా 66:24

వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.

యెహెజ్కేలు 29:2

నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశమంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

యోవేలు 3:19

ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.

జెకర్యా 14:16

మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.