Logo

2సమూయేలు అధ్యాయము 3 వచనము 10

2సమూయేలు 17:11 కాబట్టి నా ఆలోచన యేమనగా, దానునుండి బెయేర్షెబావరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులనందరిని నలుదిశలనుండి నీయొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను.

2సమూయేలు 24:2 అందుకు రాజు తనయొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచి జనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా

న్యాయాధిపతులు 20:1 అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.

1రాజులు 4:25 సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.

1సమూయేలు 3:20 కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి

2సమూయేలు 3:21 అంతట అబ్నేరు నేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను.

1దినవృత్తాంతములు 10:14 అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.

1దినవృత్తాంతములు 21:2 దావీదు యోవాబునకును జనులయొక్క అధిపతులకును మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొనిరండని ఆజ్ఞ ఇచ్చెను.