Logo

2సమూయేలు అధ్యాయము 17 వచనము 2

2సమూయేలు 16:14 రాజును అతనితోకూడనున్న జనులందరును బడలినవారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి.

ద్వితియోపదేశాకాండము 25:18 నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుకనున్న బలహీనులనందరిని హతముచేసెను.

1రాజులు 22:31 సరియారాజు తన రథములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా

జెకర్యా 13:7 ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరి మీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు గొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.

మత్తయి 21:38 అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని

మత్తయి 26:31 అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా గొఱ్ఱల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱలు చెదరిపోవును అని వ్రాయబడియున్నది గదా.

యోహాను 11:50 మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.

యోహాను 18:4 యేసు తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.

యోహాను 18:5 వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.

యోహాను 18:6 ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీదపడిరి.

యోహాను 18:7 మరల ఆయన మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా

యోహాను 18:8 యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.

2సమూయేలు 4:1 హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను, ఇశ్రాయేలు వారికందరికి ఏమియు తోచకయుండెను.

2సమూయేలు 17:29 తేనె వెన్న గొఱ్ఱలు జున్నుముద్దలు దావీదును అతనియొద్దనున్న జనులును భోజనము చేయుటకై తీసికొనివచ్చిరి.

2సమూయేలు 18:3 జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగముమంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మావంటి పదివేల మందితో నీవు సాటి; కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి.

2సమూయేలు 20:21 బిక్రి కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదుమీద ద్రోహము చేసియున్నాడు; మీరు వానిని మాత్రము అప్పగించుడి; తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి

నెహెమ్యా 4:11 మా విరోధులును వారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారిమధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి.

కీర్తనలు 25:19 నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.

కీర్తనలు 35:8 వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక.

కీర్తనలు 55:10 రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారములమీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.

కీర్తనలు 64:2 కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము

కీర్తనలు 71:4 నా దేవా, భక్తిహీనులచేతిలోనుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము.

కీర్తనలు 109:16 ఏలయనగా కృప చూపవలెనన్న మాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను.

కీర్తనలు 124:7 పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొనియున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొనియున్నాము.

యాకోబు 3:6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.