Logo

2సమూయేలు అధ్యాయము 19 వచనము 40

2సమూయేలు 19:11 రాజైన దావీదు ఇది విని యాజకులగు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి ఇశ్రాయేలువారందరు మాటలాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరల తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు?

2సమూయేలు 19:12 మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులైయుండగా రాజును తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను.

2సమూయేలు 19:13 మరియు అమాశాయొద్దకు దూతలను పంపినీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.

2సమూయేలు 19:14 అతడు పోయి యెవరును తప్పకుండ యూదావారినందరిని రాజునకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయగా నీవును నీ సేవకులందరును మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నదియొద్దకు రాగా

2సమూయేలు 19:15 యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యివతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి.

ఆదికాండము 49:10 షిలోహు వచ్చువరకు యూదాయొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.

మత్తయి 21:9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

ఆదికాండము 31:46 మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పవేసిరి; అక్కడ వారు ఆ కుప్పయొద్ద భోజనము చేసిరి.

2సమూయేలు 19:37 నేను నా ఊరి యందుండి మరణమై నా తలిదండ్రుల సమాధియందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా యేలినవాడవును రాజవునగు నీతోకూడ వచ్చుటకు సెలవిమ్ము; నీ దృష్టికి ఏది యనుకూలమో దానిని అతనికి చేయుమని మనవిచేయగా

2సమూయేలు 20:2 ఇశ్రాయేలు వారందరు దావీదును విడిచి బిక్రి కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యొర్దాను నదినుండి యెరూషలేమువరకు యూదావారు రాజును హత్తుకొనిరి.