Logo

2సమూయేలు అధ్యాయము 20 వచనము 7

2సమూయేలు 20:23 యోవాబు ఇశ్రాయేలు దండువారందరికి అధిపతియై యుండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియై యుండెను.

2సమూయేలు 8:16 సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతియై యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను.

2సమూయేలు 8:18 యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.

2సమూయేలు 15:18 అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరేతీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందల మంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.

2సమూయేలు 23:22 ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది

2సమూయేలు 23:23 ఆ ముప్పది మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.

1రాజులు 1:38 కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచర గాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొనిరాగా

1రాజులు 1:44 రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచర గాడిదమీద అతని నూరేగించిరి;

2సమూయేలు 20:11 యోవాబు బంటులలో ఒకడు అతనిదగ్గర నిలిచి యోవాబును ఇష్టులైన దావీదు పక్షమున నున్నవారందరు యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను.

1దినవృత్తాంతములు 18:17 యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియై యుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.