Logo

2సమూయేలు అధ్యాయము 21 వచనము 5

2సమూయేలు 21:1 దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవు కలుగగా దావీదు యెహోవాతో మనవిచేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనినిబట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.

ఎస్తేరు 9:24 యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని, పూరు, అనగా చీటి వేయించియుండగా

ఎస్తేరు 9:25 ఎస్తేరు, రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి, వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను.

మత్తయి 7:2 మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.

దానియేలు 9:26 ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.