Logo

2సమూయేలు అధ్యాయము 21 వచనము 7

2సమూయేలు 4:4 సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలునుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు అయిదేండ్లవాడు; వాని దాది వానిని ఎత్తికొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు.

2సమూయేలు 9:10 కాబట్టి నీవును నీ కుమారులును నీ దాసులును అతనికొరకు ఆ భూమిని సాగుబడిజేసి, నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను; నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్లయొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు పదునైదుమంది కుమారులును ఇరువదిమంది దాసులును ఉండిరి.

2సమూయేలు 16:4 అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబా నా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననెను.

2సమూయేలు 19:25 రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతూ, నీవు నాతో కూడ రాకపోతివేమని అతని నడిగెను

1సమూయేలు 18:3 దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసికొనెను.

1సమూయేలు 20:8 నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండినయెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొనిపోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవి చేయగా

1సమూయేలు 20:15 నేను చనిపోయినయెడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమిమీద నిలువకుండ నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతివారికి దయచూపక పోయినయెడల నేమి యెహోవా నిన్ను విసర్జించును గాక.

1సమూయేలు 20:17 యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను.

1సమూయేలు 20:42 అంతట యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మనస్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగివచ్చెను.

1సమూయేలు 23:18 వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన యింటికి తిరిగివెళ్లెను.

లేవీయకాండము 5:4 మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టుపెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టుపెట్టుకొనినయెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును.

యెహోషువ 2:17 ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరియిదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు

యెహోషువ 6:22 అయితే యెహోషువఆ వేశ్యయింటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగినవారినందరిని అక్కడనుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన యిద్దరు మనుష్యులతో చెప్పగా

యెహోషువ 9:18 సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేయలేదు. కాగా సమాజమంతయు ప్రధా నులకు విరోధముగా మొఱ్ఱపెట్టిరి.

సామెతలు 18:24 బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.

సామెతలు 27:10 నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి,