Logo

నెహెమ్యా అధ్యాయము 2 వచనము 2

ఆదికాండము 40:7 అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయియున్నవని తన యజమానుని యింట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను.

సామెతలు 15:13 సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.

ఆదికాండము 40:1 అటుపిమ్మట ఐగుప్తు రాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పుచేసిరి

1రాజులు 21:5 అంతట అతని భార్యయైన యెజెబెలు వచ్చి నీవు మూతి ముడుచుకొనినవాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడుగగా

నెహెమ్యా 7:7 తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య యిదే.

కీర్తనలు 13:2 ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును? ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?

కీర్తనలు 137:5 యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.

సామెతలు 12:25 ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.

ప్రసంగి 7:4 జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును.