Logo

నెహెమ్యా అధ్యాయము 3 వచనము 3

నెహెమ్యా 12:39 మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతలనుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱల గుమ్మమువరకు వెళ్లి బందీగృహపు గుమ్మములో నిలిచిరి.

2దినవృత్తాంతములు 33:14 ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను.

జెఫన్యా 1:10 ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.

నెహెమ్యా 3:6 పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పానెయ కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.

నెహెమ్యా 2:8 పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను.

నెహెమ్యా 6:1 నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండ సంపూర్ణముగా గోడను కట్టి యుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని

నెహెమ్యా 7:1 నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట