Logo

నెహెమ్యా అధ్యాయము 13 వచనము 30

నెహెమ్యా 10:30 మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు

నెహెమ్యా 12:1 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా

నెహెమ్యా 12:2 అమర్యా మళ్లూకు హట్టూషు

నెహెమ్యా 12:3 షెకన్యా రెహూము మెరేమోతు

నెహెమ్యా 12:4 ఇద్దో గిన్నెతోను అబీయా.

నెహెమ్యా 12:5 మీయామిను మయద్యా బిల్గా

నెహెమ్యా 12:6 షెమయా యోయారీబు యెదాయా

నెహెమ్యా 12:7 సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి.

నెహెమ్యా 12:8 మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాదిసేవ విషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును.

నెహెమ్యా 12:9 మరియు బక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలోనుండి పాడువారు.

నెహెమ్యా 12:10 యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయాదాను కనెను.

నెహెమ్యా 12:11 యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.

నెహెమ్యా 12:12 యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా

నెహెమ్యా 12:13 ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహోహానాను

నెహెమ్యా 12:14 మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు

నెహెమ్యా 12:15 హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి

నెహెమ్యా 12:16 ఇద్దో యింటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము

నెహెమ్యా 12:17 అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.

నెహెమ్యా 12:18 బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహోనాతాను

నెహెమ్యా 12:19 యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ

నెహెమ్యా 12:20 సల్లయి యింటివారికి కల్లయి ఆమోకు ఇంటివారికి ఏబెరు

నెహెమ్యా 12:21 హిల్కీయా యింటివారికి హషబ్యా, యెదాయా యింటివారికి నెతనేలు.

నెహెమ్యా 12:22 ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా యోహానాను యద్దూవ కుటుంబప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడికాలములో వారే యాజకకుటుంబ ప్రధానులుగా దాఖలైరి.

నెహెమ్యా 12:23 ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినములవరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి.

నెహెమ్యా 12:24 లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురువరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదు యొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతులచొప్పున నిర్ణయింపబడిరి.

నెహెమ్యా 12:25 మత్తన్యా బక్బుక్యా ఓబద్యా మెషుల్లాము టల్మోను అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టులయొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి.

నెహెమ్యా 12:26 వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధికారియైన నెహెమ్యా దినములలోను యాజకుడును శాస్త్రియునగు ఎజ్రా దినములలోను ఆ పని జరువుచువచ్చిరి.

1దినవృత్తాంతములు 23:1 దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.

1దినవృత్తాంతములు 26:32 పరాక్రమశాలులగు వాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటిపెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబేనీయుల మీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారిమీదను వారిని నియమించెను.

నెహెమ్యా 9:2 ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి,తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి.