Logo

ఎస్తేరు అధ్యాయము 6 వచనము 2

ఎస్తేరు 2:21 ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని యుండిరి.

రూతు 2:3 కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.

ఎస్తేరు 2:22 ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణియైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాని తెలియజేసెను.

ఎస్తేరు 2:23 ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను.

ఎస్తేరు 7:9 రాజుముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తుగల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్నదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.

ప్రసంగి 9:15 అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.