Logo

ప్రసంగి అధ్యాయము 8 వచనము 16

ప్రసంగి 2:24 అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసికొంటిని.

ప్రసంగి 3:12 కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుటకంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని.

ప్రసంగి 3:13 మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.

ప్రసంగి 3:22 కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొని పోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము.

ప్రసంగి 5:18 మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము.

ప్రసంగి 9:7 నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.

ప్రసంగి 9:8 ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము.

ప్రసంగి 9:9 దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రదుకునందు నీవు కష్టపడి చేసికొనినదాని యంతటికి అదే నీకు కలుగు భాగము.

1తిమోతి 4:3 ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.

1తిమోతి 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;

1తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.

ఆదికాండము 25:34 యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.

రూతు 3:7 బోయజు మనస్సున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.

1దినవృత్తాంతములు 29:22 ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.

ప్రసంగి 1:3 సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభమేమి?

ప్రసంగి 2:1 కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్నమాయెను.

ప్రసంగి 2:22 సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటిచేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?

ప్రసంగి 11:8 ఒకడు చాలా సంవత్సరములు బ్రదికినయెడల చీకటిగల దినములు అనేకములు వచ్చునని యెరిగియుండి తాను బ్రదుకుదినములన్నియు సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము.