Logo

విలాపవాక్యములు అధ్యాయము 2 వచనము 13

యెహెజ్కేలు 30:24 మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావుదెబ్బ తినినవాడై మూల్గులిడును.

యెషయా 53:12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనము చేసెను

ఆదికాండము 35:18 ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.

ద్వితియోపదేశాకాండము 28:18 నీ గర్భఫలము నీ భూమిపంట నీ ఆవులు నీ గొఱ్ఱమేకల మందలు శపింపబడును;

యెషయా 51:20 యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.

యిర్మియా 37:21 కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహశాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.

విలాపవాక్యములు 1:11 దాని కాపురస్థులందరు నిట్టూర్పువిడుచుచు ఆహారము వెదకుదురు తమ ప్రాణసంరక్షణకొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించిచూడుము.

విలాపవాక్యములు 2:19 నీవులేచి రేయి మొదటిజామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీచేతులను ఆయనతట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు

విలాపవాక్యములు 4:4 దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు.

లూకా 10:30 అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికో పట్టణమునకు దిగివెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి

యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.