Logo

యోవేలు అధ్యాయము 2 వచనము 20

యోవేలు 2:24 కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును.

యోవేలు 1:10 పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.

యెషయా 62:8 యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు.

యెషయా 62:9 ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో దాని త్రాగుదురు.

యెషయా 65:21 జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.

యెషయా 65:22 వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు

యెషయా 65:23 వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.

యెషయా 65:24 వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను.

హోషేయ 2:15 అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు

ఆమోసు 9:13 రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వతములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్ని రసధారలగును; ఇదే యెహోవా వాక్కు.

ఆమోసు 9:14 మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు.

హగ్గయి 2:16 నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుచున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమే దొరకును.

హగ్గయి 2:17 తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.

హగ్గయి 2:18 మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమ్మిదవ నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.

హగ్గయి 2:19 కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయినను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.

మలాకీ 3:10 నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మలాకీ 3:11 మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు

మలాకీ 3:12 అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మత్తయి 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.

యోవేలు 2:26 నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.

యెహెజ్కేలు 34:29 మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోటయొకటి నే నేర్పరచెదను.

యెహెజ్కేలు 36:15 నిన్నుగూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవిక భరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 39:29 అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

ఆదికాండము 27:28 ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించు గాక

లేవీయకాండము 26:5 మీ ద్రాక్షపండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.

ద్వితియోపదేశాకాండము 11:15 మరియు నీవు తిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.

1సమూయేలు 17:26 దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించినవానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారినడుగగా

2సమూయేలు 21:14 సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను.

కీర్తనలు 39:8 నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.

నహూము 1:12 యెహోవా సెలవిచ్చునదేమనగా వారు విస్తారజనమై పూర్ణబలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు; నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.