Logo

యెహోషువ అధ్యాయము 4 వచనము 17

ఆదికాండము 8:16 నీవును నీతో కూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.

ఆదికాండము 8:17 పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడ నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.

ఆదికాండము 8:18 కాబట్టి నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి.

దానియేలు 3:26 అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.

అపోస్తలులకార్యములు 16:23 వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికాజ్ఞాపించిరి.

అపోస్తలులకార్యములు 16:35 ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి.

అపోస్తలులకార్యములు 16:36 చెరసాల నాయకుడీమాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.

అపోస్తలులకార్యములు 16:37 అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొనిపోవలెనని చెప్పెను

అపోస్తలులకార్యములు 16:38 ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి,

అపోస్తలులకార్యములు 16:39 వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి.