Logo

యెహోషువ అధ్యాయము 13 వచనము 24

సంఖ్యాకాండము 32:34 గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను

సంఖ్యాకాండము 32:35 యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను

సంఖ్యాకాండము 32:36 అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి.

ద్వితియోపదేశాకాండము 4:48 మోషేయు ఇశ్రాయేలీయులును ఐగుప్తులోనుండి వచ్చుచు ఆ సీహోనును హతముచేసి అతని దేశమును, యొర్దాను ఇవతల ఉదయదిక్కుననున్న బాషాను రాజైన ఓగుయొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమోరీయుల యిద్దరు రాజులదేశమును,

ద్వితియోపదేశాకాండము 33:20 గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహువును నడినెత్తిని చీల్చివేయును.

1సమూయేలు 13:7 కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లిపోయిరి గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి.

1దినవృత్తాంతములు 5:11 గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.

యిర్మియా 49:2 కాగా యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బామీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడజేసెదను; అది పాడుదిబ్బయగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెహెజ్కేలు 48:27 జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒకభాగము;