Logo

1రాజులు అధ్యాయము 1 వచనము 25

1రాజులు 1:9 అదోనీయా ఏన్‌రోగేలు సమీపమందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, రాజకుమారులగు తన సహోదరులనందరిని యూదావారగు రాజు యొక్క సేవకులనందరిని పిలిపించెను గాని

1రాజులు 1:19 అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతియైన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు.

1సమూయేలు 11:14 మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా

1సమూయేలు 11:15 జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.

1దినవృత్తాంతములు 29:21 తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱపొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱపిల్లలను వాటి పానార్పణలతో కూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.

1దినవృత్తాంతములు 29:22 ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.

1దినవృత్తాంతములు 29:23 అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులైయుండిరి.

1రాజులు 1:34 యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని ప్రకటన చేయవలెను.

1సమూయేలు 10:24 అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచినవానిని మీరు చూచితిరా? జనులందరిలో అతనివంటి వాడొకడును లేడని చెప్పగా, జనులందరు బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి యగుగాక అని కేకలు వేసిరి.

2సమూయేలు 16:16 దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయనునతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి రాజు చిరంజీవియగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా

2రాజులు 11:12 అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి రాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.

2దినవృత్తాంతములు 23:11 అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొనివచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించి రాజు చిరంజీవియగునుగాక యనిరి.

మత్తయి 21:9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

మార్కు 11:9 మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును జయము

మార్కు 11:10 ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

లూకా 19:38 ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్త్రోత్రము చేయసాగిరి

2సమూయేలు 13:23 రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.

1రాజులు 1:31 బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.

1రాజులు 1:39 యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరును రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని కేకలువేసిరి

1రాజులు 2:15 అతడు రాజ్యము నాదై యుండెననియు, నేను ఏలవలెనని ఇశ్రాయేలీయులందరు తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు; అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను; అది యెహోవావలన అతనికి ప్రాప్తమాయెను,

1రాజులు 2:22 అందుకు రాజైన సొలొమోను షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను.

1రాజులు 2:26 తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.

2రాజులు 10:3 కాబట్టి యీ తాకీదు మీకు ముట్టినవెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన యొకని కోరుకొని, తన తండ్రి సింహాసనముమీద అతనిని ఆసీనునిగా చేసి, మీ యజమానుని కుటుంబికుల పక్షమున యుద్ధమాడుడి.

నెహెమ్యా 6:7 యూదులకు రాజుగా ఉన్నాడని నిన్నుగూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలును రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును, అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియనియు, దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను.

దానియేలు 2:4 కల్దీయులు సిరియా బాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.