Logo

1రాజులు అధ్యాయము 1 వచనము 42

2సమూయేలు 15:36 సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.

2సమూయేలు 17:17 తాము పట్టణముతట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్‌రోగేలు దగ్గర నిలిచియుండగా పనికత్తె యొకతెవచ్చి, హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి.

1రాజులు 22:18 అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి ఇతడు నన్నుగూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా

2సమూయేలు 18:27 కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలొ

2రాజులు 9:22 అంతట యెహోరాము యెహూను చూచి యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమైయుండగా సమాధానమెక్కడనుండి వచ్చుననెను.

యెషయా 57:21 దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.

1దెస్సలోనీకయులకు 5:2 రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

1దెస్సలోనీకయులకు 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు