Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 2 వచనము 54

1దినవృత్తాంతములు 2:51 బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారేపును.

1దినవృత్తాంతములు 11:30 నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,

2సమూయేలు 23:29 నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,

ఎజ్రా 2:22 నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,

నెహెమ్యా 7:26 బేత్లెహేము నెటోపా వారు నూట ఎనుబది యెనమండుగురును

నెహెమ్యా 12:28 అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతి యొక్క గ్రామములలోనుండియు కూడుకొని వచ్చిరి.

యెహోషువ 16:2 తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును.

1దినవృత్తాంతములు 4:2 శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.

1దినవృత్తాంతములు 8:6 ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటిపెద్దలుగా నుండిరి;

1దినవృత్తాంతములు 9:16 యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.

యిర్మియా 40:8 కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయకాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలో నుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.

మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.