Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 3 వచనము 9

2సమూయేలు 5:13 దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూషలేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి

2సమూయేలు 13:1 తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరి యుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను.

2సమూయేలు 13:2 తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను.

2సమూయేలు 13:3 అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు

2సమూయేలు 13:4 రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.

2సమూయేలు 13:5 యెహోనాదాబు­ నీవు రోగివైనట్టు వేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు­ నా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధముచేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.

2సమూయేలు 13:6 అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవిచేయగా

2సమూయేలు 13:7 దావీదు నీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.

2సమూయేలు 13:8 కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.

2సమూయేలు 13:9 అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండనెను.

2సమూయేలు 13:10 వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోను నీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గది లోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను.

2సమూయేలు 13:11 అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా

2సమూయేలు 13:12 ఆమె నా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచుకొందును?

2సమూయేలు 13:13 నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము;

2సమూయేలు 13:14 అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.

2సమూయేలు 13:15 అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమె యెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటె అతడు మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా

2సమూయేలు 13:16 ఆమె నన్ను బయటకు తోసివేయుటవలన నాకు నీవిప్పుడు చేసిన కీడుకంటె మరి యెక్కువకీడు చేయకుమని చెప్పినను

2సమూయేలు 13:17 అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి దీనిని నాయొద్దనుండి వెళ్లగొట్టి తలుపు గడియవేయుమని చెప్పెను.

2సమూయేలు 13:18 కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీరయొకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేసెను.

2సమూయేలు 13:19 అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తిమీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా

2సమూయేలు 13:20 ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచి నీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా? నా చెల్లీ నీవు ఊరకుండుము; అతడు నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంటనుండెను.

1రాజులు 15:8 అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.