Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 12 వచనము 21

1సమూయేలు 30:1 దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,

1సమూయేలు 30:2 ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయియుండిరి.

1సమూయేలు 30:3 దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొనిపోబడి యుండుటయు చూచి

1సమూయేలు 30:4 ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.

1సమూయేలు 30:5 యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి

1సమూయేలు 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులనుబట్టియు కుమార్తెలనుబట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.

1సమూయేలు 30:7 పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.

1సమూయేలు 30:8 నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.

1సమూయేలు 30:9 కాబట్టి దావీదు అతని యొద్దనున్న ఆరువందల మందియును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి.

1సమూయేలు 30:10 దావీదును నాలుగువందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవుచుండగా

1సమూయేలు 30:11 పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొనివచ్చి, వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చుకొనలేదని తెలిసికొని, వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షగెలలను వానికిచ్చిరి.

1సమూయేలు 30:12 వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా

1సమూయేలు 30:13 దావీదు నీవు ఏ దేశపువాడవు? ఎక్కడనుండి వచ్చితివని వాని నడిగెను. అందుకు వాడు నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని; మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను.

1సమూయేలు 30:14 మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పెను.

1సమూయేలు 30:15 ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వాని నడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిబట్టి నీవు నాకు ప్రమాణము చేసినయెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను.

1సమూయేలు 30:16 తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములోనుండియు యూదా దేశములోనుండియు తాము దోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.

1సమూయేలు 30:17 దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కి పారిపోయిన నాలుగువందల మంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.

1దినవృత్తాంతములు 12:20 అంతట అతడు సిక్లగునకు తిరిగిపోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షము చేరిరి.

1దినవృత్తాంతములు 5:24 వారి పితరుల యిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమశాలులై తమ పితరుల యిండ్లకు పెద్దలైరి.

1దినవృత్తాంతములు 11:10 ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.

1దినవృత్తాంతములు 11:21 ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.

1దినవృత్తాంతములు 11:22 మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్పవాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారుల నిద్దరిని చంపెను; మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను.