Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 14 వచనము 11

2సమూయేలు 5:20 కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతముచేసి, జలప్రవాహములు కొట్టుకొనిపోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను2 పేరు పెట్టెను.

యెషయా 28:21 నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును.

కీర్తనలు 18:13 యెహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను.

కీర్తనలు 18:14 ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను.

కీర్తనలు 18:15 యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.

కీర్తనలు 44:3 వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.

కీర్తనలు 144:1 నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నాచేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.

కీర్తనలు 144:10 నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గమునుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు

నిర్గమకాండము 14:28 నీళ్లు తిరిగివచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

యోబు 30:14 గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.

మత్తయి 7:27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.

2సమూయేలు 5:21 ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతనివారును వాటిని పట్టుకొనిరి.

కీర్తనలు 118:12 కందిరీగలవలె నామీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.